Jul 08,2023 22:15

జయంతి వేడుకల్లో వైసిపి నేతలు
ప్రజాశక్తి - నరసాపురం టౌన్‌

             ప్రభుత్వ చీఫ్‌ విప్‌ క్యాంపు కార్యాలయంలో, పట్టణ పరిధిలో స్టీమర్‌ రోడ్డులో ఉన్న విగ్రహాలకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాప్రతి నిధులు మెరుగైన సేవలందించాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఎంబిసి ఛైర్మన్‌ వీరన్న, రాష్ట్ర కనీస వేతనాలు చైర్‌ పర్సన్‌ బర్రె లీలా, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బంధన పూర్ణ ంద్రరావు, వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బర్రె శ్రీవెంకటరమణ, వైస్‌ ఛైర్మన్‌ కొత్తపల్లి భుజంగరాయుడు, వైస్‌ చైర్‌పర్సన్‌ కామన నాగిని, జెడ్‌పిటిసి సభ్యులు రాధాకృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
               కాళ్ల : వైఎస్‌ఆర్‌ పేదల పెన్నిధి అని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నర సింహరాజు అన్నారు. మండలంలోని పెదఅమిరం సీసలి, దొడ్డనపూడి, ప్రాతళ్లమెరక, కలవపూడి, ఏలూరుపాడు, జువ్వలపాలెం, కాళ్ల, కోపల్లె గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, పెదఅమిరం గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, ఎంపిపి శిరీష విశ్వనాథరాజు, కోపల్లె సొసైటీ అధ్యక్షులు వేగేశ్న జయ రామకృష్ణంరాజు, వైసిపి నాయకులు వేగేశ్న బాలగణపతి వర్మ, సత్యనారాయణ, రమేష్‌ పాల్గొన్నారు.
               ఆచంట : మండలంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు వైసిపి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచంట, కొడమంచిలి, పెదమల్లం, కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం, పెనుమంచిలి, ఆచంట వేమవరం అయోధ్యలంక గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య, సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు, సుంకర సీతారామ్‌, జక్కంశెట్టి చంటి, దిరిశాల విజయలక్ష్మి, గణేశుల శేషవాణి సుబ్బారావు పాల్గొన్నారు.
           ఉండి : మండలంలోని అన్ని గ్రామాల్లోనూ, రైతు భరోసా కేంద్రాల్లోనూ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ఉండి పోలీసు స్టేషన్‌ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. 2004లో పాదయాత్ర చేసేటప్పుడు రైతులకు, రోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తీసుకువచ్చి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. అనంతరం పేదలకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు గులిపల్లి అచ్చారావు, కొర్రపాటి అనిత, నాయకులు రణస్తుల మహంకాళి, గొట్టుముక్కల కల్యాణ్‌వర్మ, కరిమెరక మల్లికా ర్జున, కమతం బెనర్జీ, కరిమెరక శివ నాగరాజు, అంగర రాంబాబు, శేషాద్రి శ్రీనివాస్‌, రాయి సతీష్‌, బడుగు బాలాజీ, వీరమల్లు మల్లేశ్వరరావు, గలావిల్లి ధనుంజయ పాల్గొన్నారు.
       గణపవరం : రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా శనివారం స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. వృద్ధులకు దుప్పట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దండు వెంకటరామరాజు, వైసిపి మండల కన్వీనర్‌ దండురాము, గ్రామ సర్పంచి మూరా అలంకారం భాస్కరరావు, సూర్యబలిజ రాష్ట్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శెట్టి అనంతలక్షి, వైసిపి నాయకులు కాకర్ల శ్రీను, రోంగల శ్రీను, డి.బాబులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సరిపల్లెలో సర్పంచుల ఛాంబార్‌ అధ్యక్షురాలు చనుమూరి లక్ష్మీదుర్గాభవాని శివప్రసాద్‌, వెంకటరాజపురంలో సర్పంచి మల్లంపల్లి సురేష్‌, మొయ్యేరులో సర్పంచి దూళ్ల కుటుంబరావు, పిప్పరలో సర్పంచి కాకర బేబి, కేశవరంలో మిడతాని కామేశ్వరి నాగేశ్వరావు, ఎ.గోపవరంలో, పద్మ శ్రీనివాస్‌ వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉన్న రోగులకు ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ వైఎస్‌ఆర్‌ టియు సి జిల్లా అధ్యక్షులు జాలాది వెల్సన్‌ బాబు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో డాక్టర్‌ కిరణ్మయి పాల్గొన్నారు.
         పోడూరు : మండలంలోని కొమ్ముచిక్కాల గ్రామంలో వైఎస్‌ఆర్‌ జంయతిని పార్టీ నేతలు, అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ విగ్రహానికి జెడ్‌పిటిసి సభ్యులు పెద్దిరాజు, గ్రామ ప్రముఖులు, పార్టీ సీనియర్‌ నాయకులు గుంటూరి చంటిరాజు, గ్రామ కమిటీ అధ్యక్షులు నాగరాజు బాలాజీ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామకృష్ణంరాజు, యరకరాజు పెద్దిరాజు, వీరవల్లి దుర్గారావు, తానేటి సురేష్‌ పాల్గొన్నారు.
        మొగల్తూరు : మొగల్తూరులోని పంచాయతీ కార్యాలయ సమీపంలో ఉన్న వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వైసిపి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచి పడవల మేరీ సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు తిరుమని బాపూజీ, వైస్‌ ఎంపిపి కైలా సుబ్బారావు, బోణం నరసింహరావు, దూసనపూడి దొరబాబు, కర్రి ఏసుబాబు, కుక్కల కృష్ణమోహన్‌, సంకు రామారావు, మోటూరి కుమార్‌రాజా, బి.నాగరాజు పాల్గొన్నారు.
          పాలకొల్లు : కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు యడ్ల శివాజీ అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి శివాజీతో పాటు మహిళా నాయకురాలు వై.నామగిరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బోనం వెంకట్రావు, షేక్‌ మహబూబా జాని, కొలుకులూరి అర్జున్‌రావు, రొక్కాల గన్నిపాల్‌, చాగంటి అంజిబాబు, బొలిశెట్టి భానుప్రకాష్‌, ఎం.ప్రసాద్‌ పాల్గొన్నారు.
          పాలకోడేరు : విస్సాకోడేరు రావిచెట్టు సెంటర్‌లో రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎంపిపి చంటిరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, చీరలు, పం డ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బొల్లా శ్రీనివాస్‌, ఉపసర్పంచి కందుల నాగరాజు, మాజీ సర్పంచి శ్రీనివాస్‌రాజు, నాయకులు అశోక్‌బాబు, పాలకవర్గ సభ్యులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు. గొల్లకోడేరులో వైసిపి గ్రామ పార్టీ అధ్యక్షులు చేకూరి రాజానరేంద్రవర్మ ఆధ్వర్యంలో రాజశేఖర్‌ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయం సమీపన్న ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొగల్లు లో నిర్వహించిన వేడుకల్లో వైసిపి యూత్‌ విభాగం మండల అధ్యక్షులు పెనుమత్స వెంకటరాజు(బాబు), ఉప సర్పంచి సీతారామ రాజు, ఎంపిటిసి సభ్యులు కాటూరి శాంతకుమారి, వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెనుగొండ : పెనుగొండలో వికెపి కాలేజీ సెంటర్‌లో ఎంపిటిసి సభ్యులు తాడి సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు, వృద్ధులకు బ్రెడ్‌, పాలు అంది ంచారు. ఈ కార్యక్రమంలో పవన్‌, మేడపాడు చంద్రమోహ న్‌రెడ్డి, సిహెచ్‌.రాజు, నూలి లక్ష్మన్న, పుల్లారావు పాల్గొన్నారు.
          ఆకివీడు : స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లో వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద, స్థానిక చేపల మార్కెట్‌ వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహానికి జెడ్‌పిటిసి సభ్యులు వెంకటరాజు (ఎండగండి శ్రీనివాసు) పార్టీ నేతలతో కలిసి వైసిపి ఉండి కన్వీనర్‌ పివిఎల్‌.నరసింహరాజు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు, పేదల కు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ హైమావతి, వైస్‌ చైర్‌పర్సన్‌ పుప్పాల సత్యనారాయణ, వంగ జాన్సి పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : స్థానిక ఎంఎల్‌ఎ గ్రంథి శ్రీనివాస్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పార్టీ నేతలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన పేదల పెన్నిధి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అని చెప్పారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేందుకు ఆనాడు ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి, రాష్ట్ర క్రిస్టియన్‌, మైనార్టీ సెల్‌ ఛైర్మన్‌ జాన్సన్‌ పాల్గొన్నారు.
           వీరవాసరం :వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను మండల వ్యాప్తంగా వైసిపి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వీరవాసరం, తోలేరు, రాయకుదురులలో నిర్వహించిన జయంతి వేడుకల్లో రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. తోలేరు దళితపేటలో ఎఎంసి డైరక్టర్‌ బిల్‌రాజ్‌ ఆధ్వర్యంలో రాజశేఖర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.