
ఆమదాలవలస : బ్యాంకులను జాతీయం చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి పేదల పెన్నిధిగా నిలిచారని పిసిసి ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. పట్టణంలోని గేటులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఉక్కు మహిళగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. దేశ సర్వతో ముఖాభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేసి దేశాభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. దేశ అభివృద్ధి జరిగిందంటే ఇందిరమ్మ పాలనలోనేనని అన్నారు. సాగుతాగు నీరు లేక ఇబ్బంది పడుతున్న దళితుల అభివృద్ధికి నీరు కోసం బావులను తవ్వించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభారు పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళ్లర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి బొడ్డేపల్లి గోవింద గోపాల్, బస్వా షణ్ముఖరావు, లఖినేని సాయిరాం, పప్పల వెంకటరమణ, కూన సుందరరావు, గురుగుబెల్లి కృష్ణమూర్తి, ఊస రమణ, లఖినేని సునీల్‌కుమార్, దాలయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39వ వర్థంతిని పురస్కరించుకొని జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యాన పార్టీ కార్యకర్తలు స్వచ్ఛంద రక్తదానం చేశారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ పూర్వ అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి ప్రారంభించారు. ఈ మేరకు 20 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, ప్రతినిధులు కె.సత్యనారాయణ, బి.చిన్మయిరావ్, కాంగ్రెస్ కమిటీ జిల్లా నాయకులు సనపల అన్నాజీరావు, కె.వి.ఎల్.ఈశ్వరి, బస్వ షణ్ముఖరావు, మంత్రి నరసింహమూర్తి, లక్కినేని సునీల్ పాల్గొన్నారు.