ప్రజాశక్తి-తిరుపతి సిటి
బుధవారం బాలాజీకాలనీలోని మల్బార్ షోరూమ్‌లో ఏర్పాటుచేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నగర మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోల్డ్ అండ్ డైమండ్ రిటైల్ రంగంలో రాణిస్తున్న మల్బార్ సంస్థ సేవా దక్పథంతో పేదలకు సహాయం అందించడం అభినందనీయమన్నారు. మల్బార్ గ్రూప్ హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 46 మందిని ఎంపిక చేసి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ గహ నిర్మాణానికి సహకరించటం సంతోషకరమన్నారు. ప్రతియేటా పేదలకు సేవలు స్ఫూర్తి దాయకమని తెలిపారు. ఈ కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పేదలకు చేయూతను అందించాలి అని సూచించారు. షోరూమ్ హెడ్ రిజేశ్ మాట్లాడుతూ మల్బార్ గ్రూపు ప్రతి ఏటా తమ లాభంలో 5 శాతం మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా పేద విద్యార్థుల కోసం ఉచితంగా స్కాలర్షిప్పులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు నెలవారి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. మల్బార్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మలబార్ షోరూం సేల్స్ మార్కెటింగ్ మేనేజర్ మహేందర్ పాల్గొన్నారు.










