పేదల చెంతకే వైద్యసేవలు
ప్రజాశక్తి-మర్రిపాడు : గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలకు రక్షణ కవచం లాంటిదని ఎంపిడిఒ నాగమణి అన్నారు. శుక్రవారం మండలంలోని బూదవాడ సచివాలయంలో సచివాలయ కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గోపినాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదల సంక్షేమానికి అలుపెరగని కృషి చేస్తున్నారని, అందుకోసం అనేక వినూత్న పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. ఈ వైద్య శిబిరంలో మహిళలకు సంబంధించి గైనకాలజిస్ట్ వైద్యులు, కంటి పరీక్షలు, పలు రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ సిద్ధంరెడ్డి మోహన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు రమణమ్మ, సర్పంచ్ మంచాల హరిబాబు, ఉప సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, వైసిపి నాయకులు బేరి రామ్మోహన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, తహశీల్దార్ ఆనంద రావు, ముటుకుందు సిద్ధారెడ్డి, పెగళ్లపాడు సర్పంచ్ శ్రీనివాసులు యాదవ్, వైద్య, ఐసిడిఎస్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










