పేదల ఆర్థికాభివద్ధే ప్రభుత్వ లక్ష్యం
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- గడప గడపకు మన ప్రభుత్వం లో డిప్యూటీ సీఎం
ప్రజాశక్తి -కార్వేటినగరం: పేదల అభివద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. గాజంకి సచివాలయ పరిధిలోని రౌతువానిగుంట, విరాటపురం, క్రిష్ణాపురం, దిగువ ఎర్రమరాజుపల్లి, ఎగువ ఎర్రమరాజుపల్లి, దళితవాడ, గాజంకి, గాజంకీ దళితవాడ, అమ్మోరుగుంట గ్రామాల్లో సర్పంచులు చిన్నబ్బరెడ్డి, హరోహరరెడ్డి, ఎంపీటీసీ పుత్తూరు రాధికారెడ్డి,మాజీ ఎంపీటీసీ మురగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వంకి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆర్థికాభివద్ధే లక్ష్యంగా సంక్షేమాలు అందిస్తోందని గుర్తు చేశారు. ప్రతి ఇంటికీ లక్ష నుంచి 6 లక్షల వరకు లబ్ధి చేరుకూరుతోందని తెలిపారు. పేదల పాలిట కల్పవక్షంగా నిలుస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించాలని పిలుపు నిచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసమే సీఎం గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ అధికారులను చేరువ చేశారన్నారు. పుట్టబోయే శిశువు నుంచి మతి చెందే వద్ధుడి వరకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. జగనన్న అందిస్తున్న సంక్షేమాలకు లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యేలను చిరునవ్వుతో అహ్వానిస్తూ, మంగళహారతులు పడుతు న్నారని తెలిపారు. పేదల ఆశీర్వాదాలే తమకు శ్రీరామ రక్ష అన్నారు. ఈ క్రమంలో భాగంగా రౌతువాని గుంట దళితవాడ, విరాటపురం గ్రామాల్లో విద్యుత్ తీగలు ఇళ్లపై ఉందని మంత్రి దష్టికి తీసుకు రావడంతో వెంటనే తొలగించాలని విద్యుత్ ఏడీఈ నాగరాజును ఆదేశించారు. ఎర్రరాజుపల్లి, గాంజకి, గాజంకి దళితవాడలో మురుగు నీటి కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పడంతో స్పందించిన మంత్రి వెంటనే మురుగు నీటి కాలువలు నిర్మాణం చేపట్టి నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ, మండల పార్టీ కన్వీనర్ శేఖర్‌రాజు, జిల్లా కోశాధికారి ధనంజయరెడ్డి, కృష్ణారెడ్డి, ధనంజయవర్మ, మండల కోఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్రెడ్డి, చందురాజు, మాజీ సర్పంచ్ చెంచయ్య, రాజారెడ్డి, వరాలురెడ్డి, ఉప సర్పంచ్ దొరస్వామి, ఎంపీడీవో మోహన మురళీ, తహశీల్దారు రవికుమార్, పలువురు అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.










