పేద విద్యార్థులకు సైకిళ్లు వితరణ
ఎన్‌ఆర్‌ఐ ధనుంజయ రెడ్డి
ప్రజాశక్తి- ఎస్‌ఆర్ పురం: మండలంలోని పిళ్ళారికుప్పం పంచాయతీ మూలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పేదవిద్యార్థులకు ఎన్‌ఆర్‌ఐ కే.ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో రూ.45000లు విలువ చేసే 6 సైకిలను విద్యార్థులకు జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల అభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తున్నదని, ప్రభుత్వం చేసే పనులకు దాతలు కూడా ముందుకు వచ్చి తమా వంతు సహాయ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికసహాయం చేస్తానని ఎన్‌ఆర్‌ఐ ధనుంజయ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్సిపి మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జనార్ధన్, మణి, శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మునికష్ణ, దాము,తదితరులు పాల్గొన్నారు.










