May 10,2023 17:31

ప్రజాశక్తి - కాళ్ల
రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, బహుజన సమైక్య సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంఘం వ్యవస్థాపకులు సోడదాసి గంగయ్య అన్నారు. కాళ్లకూరులో నిరుపేదలు, ఏ ఆధారం లేని వికలాంగుల దంపతులకు సంఘం జిల్లా కార్యదర్శి జి.అనిల్‌ కుమార్‌ రూ.4 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కె.రంజిత్‌, పాస్టర్‌ అహరోను, జి.సందీప్‌, టి.రాజ్‌ కుమార్‌, జి.ఆశీర్వాదం, పి.యోహాను, బి.దానియేలు పాల్గొన్నారు.