Apr 23,2023 21:13

పైపులైన్‌ లీకేజీ కావడంతో కలుషితమైన తాగునీరు

        ప్రజాశక్తి-ఉరవకొండ   మండల పరిధిలోని పెద్ద ముష్టూరులో ఉన్న తాగునీటి ట్యాంకు సమీపంలో పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. లీకేజీ ఏర్పడి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా అరకొరగా నీరు సరఫరా కావడంతోపాటు కలుషితం అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కావున ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టి నీటి వృథాను అరికట్టడంతోపాటు నీరు కలిషితం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.