పెద్దకర్మ వద్ద చెరుకు లోడ్డు బోల్తా పడిన దశ్యం
ప్రజాశక్తి-కార్వేటినగరం:
స్థానికుల కథనం మేరకు ట్రాక్టర్లో చెరుకు అధిక లోడ్డుతో వెళుతుండగా ఎదురుగా మరొక వాహనం రావడంతో ఆ వాహనానికి దారి విడువబోయి బోల్తా పడిందన్నారు. ఈ మార్గంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు ప్రయాణం చేస్తే రోడ్డు బాగోగులు తెలుస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్ రోడ్డు కావడంతో ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. వారానికి రెండు మూడు ఉంటాయని, ఈ రోడ్డు దుస్థితికి అధికారుల జాప్యమే కారణమన్నారు. ఇకనైనా రోడ్డు వెడల్పు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.










