నగర మేయర్ డాక్టర్ శిరీష
రూ.50 వేలు ప్రకటించిన భూమన అభినరు
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
నగరపాలక ఉన్నత పాఠశాల మాలవ్యాజిలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నగరపాలక సంస్థ కార్పొరేటర్, తిరుపతి 23వ డివిజన్ ఆర్ వెంకటేశ్వర్లు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ డాక్టర్ శిరీష , డిప్యూటీ మేయర్ భూమన అభినరు రెడ్డి, విచ్చేసి వారి అమూల్యమైన సలహా లను సూచనలను ఇచ్చారు. అంతేకాకుండా నగదు ప్రోత్సాహక బహుమతులు కూడా పదవ తరగతిలో అత్యున్నతమైన మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదు రూపేనా ప్రకటించడం అయినది. ఇందులో భాగంగా డిప్యూటీ మేయర్ అభినరు రూ.50 వేలు, కార్పొరేటర్ వెంకటేశ్వర్లు రూ.10 వేలు అందజే స్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి, పాఠశాల ప్రధానో పాధ్యాయులు, కే.జనార్దన్ రెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.










