- గంగాధర నెల్లూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖరారు...!?
- పచ్ఛికాపల్లం రవికుమార్ (.గ్యాస్ రవి ) అనే ప్రచారం నియోజక వర్గంలో ఊప్పదుకుంది...
ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాదాపుగా ఖరారు అయినట్లు ప్రచారం ఊపందుకుంది.గతంలో తెలుగుదేశం పార్టీ తరుపున దివంగత నేత కుతుహలమ్మ, అమే కుమారుడు పోటి చేసి ఓడిపోయారు. అనంతరం హరికృష్ణ పార్టీ సభ్యత్వంనికి, తెలుగుదేశం పార్టీ రాజీనామా చేశారు.అప్పటి నుంచి నియోజకవర్గంనికి సారైనా నాయకుడు లేడు. పార్టీ సమర్థవంతమైన నాయకుడి కోసం అన్వేషణ మొదలు పెట్టింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్వేటినగరం మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని వైయస్సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టారు .అప్పుడు పచ్చికాపల్లం రవికుమార్ (గ్యాస్.రవి) 70 కిలోమీటర్ల మేర బ్యానర్, కటౌట్లు బెలూన్లతో ఆర్చిల్తో రోడ్డుకు విలువైపులా నింపేశాడు. దీంతో ఆయన దృష్టి అతను వైపు మళ్ళింది. దీనికి తోడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నారా లోకేష్ యువగళం పేరుతో గంగాధర నెల్లూరులో పాదయాత్ర చేరుకుంది .అప్పుడు గ్యాస్ రవికుమార్ పేరు తెరపైకి వచ్చింది. జీడి నెల్లూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రవికుమార్ రే అని ప్రచారం ఊపందుకుంది.










