వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మండలం పచ్చికాపలం సమీపంలో శనివారం ఉదయం రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పచ్చికాపలం- చవటగుంట రోడ్డు పెట్రోల్ బంకు వద్ద రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు.. పచ్చికాపలం తిరుపతి రోడ్డు వద్ద గోవిందవారిపల్లె చెరువు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










