ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు హాజరు అయ్యేలా చూడాలని, అదేవిధంగా కేసులకు సంబంధించిన సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ చట్టం కింద నమోదు అయిన కేసులకు సంబంధించి సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని, సభ్యులు ఏదైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే లిఖితపూర్వకంగా ఇస్తే అవి రికార్డు చేస్తామన్నారుమార్చి 24 నుంచి ఇప్పటివరకు 13 కేసులు కు సంబంధించిన వివరాలతో పాటు తీసుకొన్న చర్యలు గురించి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రబ్బానీ బాషా వివరించారు. కేసులకు సంబంధించి తీసుకున్న చర్యలు అదేవిధంగా అధికారుల నివేదికలను వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి నివేదికను పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అంటూ జిల్లాలో మొత్తం 43 కేసులు నమోదు అయ్యాయని ఇందులో 20 కేసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయని, 9 కేసులు ఫాల్స్ కేసులుగా తేలాయని, 14 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఈ కేసులు చిత్తూరు, పలమనేరు, నగిరి పరిధిలో ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు చిత్తూరు నగర మేయర్ ఆముద, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, మెప్మా పిడి రాధమ్మ, ఆర్డీవోలు రేణుక ,సజన, ఎస్ డి సి భవాని పాల్గొన్నారు..










