ఫొటో : నీటికోసం పడిగాపులు కాస్తున్న గ్రామస్తులు
పబ్బులేటిపల్లిలో తాగునీటి కొరత
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని పబ్బులేటిపల్లి గ్రామంలోని ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో గ్రామంలో దోమలు తీవ్రత ఎక్కువగా ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. తాగునీరు, పారిశుధ్య సమస్యలను తీర్చాలని అధికారులను కోరగా పంచాయతీలలో నిధులు లేవని తెలుపుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కోసం ట్యాంకర్ల వెంబడి పరిగెత్తే పరిస్థితులు తలెత్తాయని, గంటల సేపు నిలబడుకున్న కనీసం అవసరాలకు కూడా నీరు సరిపడా అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి పబ్బులేటిపల్లి తాగునీరు, పారిశుధ్య సమస్య తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.










