పాత్రికేయుల పిల్లలకు
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్య
చిత్తూరు కలెక్టర్‌కు పాత్రికేయుల కతజ్ఞతలు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి నిర్వాహకులు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా కన్వీనర్, చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు ఎం.లోకనాథన్, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి కెఎం.అశోక్ కుమార్ కోరారు. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఎలాంటి రుసుం లేకుండా ఉచిత విద్యను అందించాలని ఇటీవల పాత్రికేయులు చిత్తూరు కలెక్టర్ షణ్‌మోహన్‌ను కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. దీనిపై కలెక్టర్ సగిలి షన్మోహన్ స్పందిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతులను గురువారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులకు అందివ్వడం జరిగింది. దీనిపై యూనియన్ నాయకులు మాట్లాడుతూ సమాజసేవలో భాగంగానే పాత్రికేయుల వత్తి కూడా కొనసాగుతోందన్నారు. పాత్రికేయుల వేతనాలు, భత్యం లాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ జర్నలిస్టుల కోసం కషి చేయడం అభినందనీయమన్నారు. ఈ విషయాన్ని ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు ఆలోచించి పాత్రికేయుల పిల్లలకు ఉచిత విద్య అందించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు మహేష్, సంయుక్త కార్యదర్శి షకీల్, కోశాధికారి పవన్‌కుమార్ పలువురు సీనియర్‌పాత్రికేయులు పాల్గొన్నారు.










