
* యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రాప్తికి పాత పెన్షన్ విధానాన్ని పునరు ద్ధరించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్, జిపిఎస్ అంగీకరించేది లేదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర పేర్కొన్నారు. నగరంలోని యుటిఎఫ్ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు అధ్యక్షతన జిల్లా ఆఫీసు బేరర్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రాప్తికి 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులను పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఏదైనా సంస్కరణ అంటే మంచి కోసం అమలు చేయాలన్నా రు. ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాల ఆకర్షించడానికి, ఉపాధ్యాయుల సంఖ్య ను పెంచి నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలన్నారు. దీనికి భిన్నంగా పాఠశాల సంఖ్య కుదింపు, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింపు, ఉపాధ్యాయులపై పనిఒత్తిడిని పెంచడం సరికాదన్నారు. దీని కోసం జిఒ 117ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ జిఒ ఉపాధ్యాయుల్లో, ప్రజల్లో, విద్యార్థు ల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మొండిగా, పాలసీ పేరుతో అమలు చేస్తుందని అన్నారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల 25 వేల ఉపాధ్యాయ పోస్టులు కనుమరుగయ్యా యన్నారు. 4,600 పైగా ప్రాథమిక పాఠశాలలు విలీనం జరిగిందని, 14,200 ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయని అన్నారు. 2,200 పాఠశాలల్లో 98 లోపు ఎన్రోల్మెంట్ ఉన్న ఫ్రీ హైస్కూళ్లలో విద్యార్థులు సక్రమంగా ఎన్రోల్మెంట్ కాలేదని అన్నారు. 505 హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. 18 వేల పాఠశాలల్లో ఈ ఏడాది ఎన్రోల్మెంట్ అరకొరగా ఉన్నట్లు చెప్తున్నారన్నారు. ఇటువంటి విధానాల వల్ల భవిష్యత్‌లో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని అన్నారు. ఈ ఏడాది మూడున్నర లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను విడిచి ప్రయివేటు స్కూళ్లలో చేరినట్టు గణాం కాలు చుపుతున్నాయన్నారు. నాడు- నేడు, జెవికె కిట్లు, అమ్మబడి, భవనాలు, ఇతర మౌలిక వసతులు సమకూర్చి ఉపాధ్యాయులను కుదించారని అన్నారు. పోస్టుల భర్తీ చేయకుండా ఉన్న ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నార న్నారు. మరోవైపు పర్యవేక్షణ పేరుతో మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పిల్లలకు మాతృభాషలో విద్య అందించాల్సిన స్థానంలో బైజుస్, ఎన్‌సిఇఆర్‌టి, సిబిఎస్‌సి సిలబస్, టోఫేల్, ఐబి అనే కొత్తకొత్త విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల పాఠశాలలకు విద్యార్థులు దూరమవుతున్నారన్నారు. ఇటువంటి సంస్కరణల వల్ల ప్రభుత్వ విద్యారంగానికి తీరని నష్టమన్నారు. పాఠశాలలకు మిగిలిన విడతల గ్రాంట్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు ఎల్.బాబూరావు, కోశాధికారి బి.శ్రీరామ్మూర్తి, జిల్లా కార్యదర్శులు హనుమంతు అన్నాజీరావు, పి.సూర్యప్రకాశరావు, వై.వాసుదేవరావు, జి.నారాయణరావు, జి.సురేష్, పి.మురళీధరరావు, జి.శారద, బి.రవికుమార్ పాల్గొన్నారు.