Sep 23,2023 00:13

పాత నేరస్తుడు తొండ మొగలాల అరెస్టు

పాత నేరస్తుడు తొండ మొగలాల అరెస్టు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: పెడింగ్‌ కేసుల పరిష్కారంలో చిత్తూరు క్రైమ్‌ పోలీసులు ఈస్టు గోగావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు తొండ మొగలాలను అరెస్టు చేసి చిత్తూరు పిఎఎస్‌ కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. పలు నేరాల్లో నిందితుడి తొండ మొగలాల ను అరెస్టు చేసేందుకు ఈస్ట్‌ గోదావరి జిల్లా గోకవారంలో చిత్తూరు క్రైమ్‌ పోసుల టీమ్‌ అదుపులోకి తీసుకుంది. ఏడు సంవత్సరాలుగా నిందితుడు పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. చిత్తూరు, నెల్లూరు, నాయుడుపేట, తిరుపతి, మదనపల్లి ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడిన్నట్లు పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులున్నాయి. పిఎఎస్‌జే ప్రిన్సిపాల్‌ అసిస్టేట్‌ సెషన్‌ జడ్జి నేరస్తుడికి 14 రోజులు రిమాండ్‌ విధించారు.