Feb 28,2022 22:37

మున్సిపల్‌ సమావేశంలో ప్రసంగిస్తున్న ఛైర్మన్‌ హరి

- పుత్తూరు పురపాలక సంఘం ఛైౖర్మన్‌ హరి
- టిడిపి, వైసిపి కౌన్సిలర్ల వాదోపవాదాలు
ప్రజాశక్తి- పుత్తూరు టౌన్‌: మున్సిపాలిటీలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే సహకారంతో అభివద్ధి పనులు చేపడుతున్నామని పుత్తూరు పురపాలక సంఘం ఛైౖర్మన్‌ ఏ.హరి తెలిపారు. సోమవారం మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం స్థానిక వైఎస్సార్‌ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తూరు మున్సిపాలిటీలో పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ విద్యుత్‌, దీపాలు తాగునీటి వసతి, తుడా సౌజన్యంతో పార్కులు, మౌలిక వసతులు కల్పిస్తూ అభివద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ అజెండా చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌లు డి శంకర్‌, డి డి జయప్రకాష్‌, కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, డిఈ మహేష్‌, ఏఈలు విశ్వకీర్తి, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శుభ ప్రద, మేనేజర్‌ మణికంఠ, శ్రీనివాసులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.