పార్టీలకు అతీతంగా జగనన్న సంక్షేమ పథకాలు : ఎమ్మెల్సీ భరత్
ప్రజాశక్తి- శాంతిపురం: ప్రజాసమస్యల పరిష్కారదిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా జగనన్న సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు సమన్వయంతో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. బుధవారం నడింపల్లి గ్రామంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల గురించి తెలుసుకుంటూ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సానుకూల స్పందన తెలియజేశారు. ప్రజలు సమస్యలు చెప్పిన వెంటనే పరిష్కార దిశలో ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసి శ్రీనివాసులు, ఎంపీపీ కె.వసుంధర కోదండరెడ్డి, మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి, జిల్లా కార్యదర్శి వినోద్, వైస్‌ఎంపీపీలు పట్టాభి, సరస్వతి రమేష్, కోఆప్షన్ నెంబర్ నిసార్, డైరెక్టర్లు కష్ణమూర్తి, చంగప్ప, పెద్దన్న, సుకుమార్, తదితరులు పాల్గొన్నారు.










