ప్రజాశక్తి-గుత్తి పార్టీలకతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తోందని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని రాజాపురం, మార్నేంపల్లి, చెర్లోపల్లి గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేతోపాటు గుంతకల్లు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ నైరుతీరెడ్డితో కలిసి ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభివద్ధి కోసమే సీఎం జగన్ మోహన్ రెడ్డి నవరత్న పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గాండ్లపాటి విశాలాక్షి, ఎంపిటిసి చిన్నవీరన్నగౌడ్, సర్పంచులు ఎ.వెంకటేష్, విజయలక్ష్మి, మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ సి.సునీలాయాదవ్, వైసిపి సీనియర్ నాయకులు బి.శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ జి.గోవర్ధన్‌రెడ్డి, నాయకులు హాజీమలన్‌బాబా, కేశవులు, సూర్యనారాయణరెడ్డి, రాజశేఖర్, కె.మధుసూదన్‌రెడ్డి, వై.సుభాష్‌రెడ్డి, గురుప్రసాద్, ప్రవీణ్‌కుమార్, ఎస్.రాముయాదవ్, హనుమంతు, సోమశేఖర్, రాము, కౌన్సిలర్లు వరదరాజులు, ఫారూక్, వాల్మీకి శివ, తదితరులు పాల్గొన్నారు.
మహిళకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి










