Sep 11,2023 22:12

పారిశుధ్యం పనులను పరిశీలిస్తున్న మేయర్‌ మహమ్మద్‌ వసీం

          ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   నగరంలోని మురుగు కాలువల్లో పూడికతీతతో పారిశుధ్య మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్‌ మహమ్మద్‌ వసీం తెలిపారు. సోమవారం నగరంలోని 38వ డివిజన్‌ పరిధిలో చేపట్టిన పూడికతీత పనులను మేయర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరంలోని కాలువల్లో పూడికతీత పనులపై దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యంగా నగరంలో రోడ్లు, డ్రెయినేజీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రాధాన్యత క్రమంలో డ్రెయినేజీల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు ఎక్కువగా ఎన్నో ఏళ్లుగా కాలువల్లో పూర్తిస్థాయిలో పూడికతీత చేపట్టలేదని ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి సంగం శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.