Oct 18,2023 19:43

మాట్లాడుతున్న కమిషనర్‌

మాట్లాడుతున్న కమిషనర్‌
పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలి
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మికతకు భంగం వాటిల్లకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ తెలిపారు. అధికారులతో కలిసి బుధవారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఉత్సవాలు జరిగే అన్ని రోజులు దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ పనులు నిరంతరం చేపట్టాలన్నారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నిరంతరం మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.