ప్రజాశక్తి-రాయదుర్గం కరోనాతోపాటు 2022లో వర్షాకాలంలో పట్టణంలోని ప్రధాన మురికి కాలువల్లో మట్టి పూడికతీత కోసం పని చేసిన 25 మంది కార్మికులను తక్షణమే ఔట్‌సోర్సింగ్ కార్మికులుగా విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 9వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా రాయదుర్గానికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ వరప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన డిప్యూటీ కలెక్టర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున, కార్మికులు పాల్గొన్నారు.
డిప్యూటీ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు










