Sep 12,2023 21:48

కిట్లను అందజేస్తున్న స్పీకర్‌ సీతారాం

*శాసనసభ స్పీకర్‌ సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస:
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 80 మంది పారిశుధ్య కార్మికులకు వ్యక్తిగత ఆరోగ్య కిట్లను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలకు పరిరక్షకులుగా నిలుస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. గతంలో మున్సిపల్‌ శాఖ నుంచి అందజేసే ఆరోగ్య కిట్లను నిలిపివేయడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కార్మికులు స్పీకర్‌ దృష్టికి తీసుకురాగా, ఉన్నతాధికారులతో మాట్లాడి అందజేసిన స్పీకర్‌కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవి సుధాకర్‌, మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌, వైస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పొన్నాడ చిన్నారావు, దుంపల శ్యామలరావు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.