ప్రజాశక్తి-అనంతపురం వైసిపి ప్రభుత్వం వచ్చాక సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా అర్హులందరికీ పాదర్శకంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం నగరంలోని ఆర్డీ కార్యాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడ్డారని గుర్తు చేశారు. అదే వైసిపి అధికారంలోకి వచ్చాక దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చి ప్రజల ఇంటి ముంగిటికే పథకాలు అందజేస్తున్న ఘనత వైసిపికే దక్కుతుందన్నారు. నగరంలో ఎన్నడూ లేనివిధంగా రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ అభివృద్ధిని రానున్న రోజుల్లో ప్రజలకు వివరిద్దామన్నారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య ప్రజలకు మంచి చేయాలన్న మంచి ఉద్దేశంతో సిఎం జగన్ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను తీసుకొస్తే ఓర్చుకోలేని టిడిపి నాయకులు తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పడం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో మరోమారు అధికారంలోకి తీసుకురావవానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జెసిఎస్ కన్వీనర్లు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, చింతకుంట మధు, వైసిపి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, కార్పొరేటర్లు సంపంగి రామాంజనేయులు, కమల్‌భూషణ్, మీనాక్షి, రమాదేవి, కమిషన్ రమణారెడ్డి, నాయకులు నాగార్జునరెడ్డి, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.
నార్పల : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే సిఎం జగన్ ధ్యేయమనిఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని షాదీఖానాలో గురువారం వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యంలో భాగంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నాయకులు రాష్ట్రం వైపు చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏం కావాలన్నా సిఫారసులు ఉంటేనే జరిగేవన్నారు. అదే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా 1వ తేదీనే వాలంటీర్లు వచ్చి పింఛన్ సొమ్మును అందజేస్తున్నారన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం పథకాలను సైతం ఇంటింటికీ అందజేస్తున్నామన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు సేవారత్న పథకాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి, జిల్లా వైస్‌ఛైర్‌ర్సన్ వేదాంతం నాగ రత్నమ్మ, ఎంపిపి నాగేశ్వరరావు, ఎంపిడిఒ దివాకర్, సర్పంచి సుప్రియ, సింగిల్‌విండో అధ్యక్షులు లోకనాథ్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుళ్లాయప్ప, ఉప సర్పంచి శ్రీరాములు ఎంపిటిసిలు, సర్పంచులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
వాలంటీర్లను సన్మానిస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి










