May 30,2023 09:26

బదిలీ నియామక పత్రాలను అందజేస్తున్న ఎస్పీ కె.శ్రీనివాసరావు

           అనంతపురం క్రైం : జిల్లా పోలీసు శాఖలో బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన బదిలీల కార్యక్రమంలో 71 మంది కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు/, ఎఎస్‌ఐలకు బదిలీలు చేసినట్లు చెప్పారు. 30-04-23వ తేదీ నాటికి ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందిని సీనియార్టీ జాబితా ప్రకారం పారదర్శకంగా బదిలీలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్‌.విజయభాస్కర్‌ రెడ్డి, జిల్లా పోలీసు పరిపాలనాధికారి శంకర్‌, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, శివప్రసాద్‌ పాల్గొన్నారు.