పారదర్శకంగా పంటనష్టం అంచనా శ్రీ 99 సంవత్సరాల లీజుకు శ్రీ వద్ధుల పెన్షన్ రూ.2750కి పెంపు శ్రీ క్యాబినెట్లో ఆమోదం
పారదర్శకంగా పంటనష్టం అంచనా
శ్రీ 99 సంవత్సరాల లీజుకు
శ్రీ వద్ధుల పెన్షన్
రూ.2750కి పెంపు
శ్రీ క్యాబినెట్లో ఆమోదం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి:
ఎన్నోఏళ్లగా సేవలందించి పాలకుల స్వార్ధ రాజకీయాలకు బలైన చిత్తూరు విజయ పాల డెయిరీ ఈసారి ఆఖరికి అమూల్ డెయిరీ పరం కానుంది. అలాగే ఇది వరకు వద్ధులకు ఇస్తున్న సామాజిక పింఛన్ రూ.2500 నుంచి 2750లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా పలు అంశాలకు సంబంధించి మంగళవారం జరిగిన క్యాబినెట్లో సమావేశంలో ఆమోదముద్ర వేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి వద్దుల పెన్షన్ రూ.2750లకి పెన్షన్ ఉంది. దీన్ని జనవరి నుంచి అందివ్వనున్నట్లు క్యాబినెట్ ప్రకటించింది. దీనివల్ల మన జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మందికి లబ్ధి కలగనుంది.
పాఠశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు ఫేజ్-1లో పనులు పూర్తయిన స్కూళ్లలో అత్యాధునిక బోధన ఉపకరణాలు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. హైస్కూల్స్ పరిధిలో ప్రతితరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ), పౌండేషన్, పౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం. 6 వతరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతిగతిలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి స్కూళ్లో ఒక టీవీ ఏర్పాటు. పదివేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసేందుకు మంత్రిమండలి ఆమోదించింది. ప్రభుత్వ స్కూళ్లలో 8వతరగతి విద్యార్ధులకు 24 గంటలపాటు ఉపయోగపడే విధంగా ట్యాబులు, ఇంకంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని 21 డిసెంబరు నాడు లాంఛనంగా ప్రారంభించనున్న ప్రభుత్వం. 8వతరగతి చదువుతున్న విద్యార్ధులతో పాటు బోధించే ఉపాధ్యాయులకు ఉచితంగా శామ్‌సంగ్ ట్యాబులు పంపిణీ. ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకపోయినా, ట్యాబును ఇంటిలో కూడా వినియోగించుకునేలా, ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్ అందుబాటులో ఉండేలా సెక్యూర్ డిజిటల్ కార్డుతో బైజూస్ సంస్ధ కంటెంట్‌తో ట్యాబ్ లు ఇవ్వనుంది.
చిత్తూరు జిల్లా సదుంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30పడకల సామర్ధ్యం నుంచి 50 పడకల సామర్ధ్యానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 18 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగల్ ఇచ్చింది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా)లో ఎస్‌ఈ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్ధానంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(సీపీఆర్‌ఓ) నియామకానికి కేబినెట్ ఆమోదం.
రాయలసీమ జిల్లాల్లో మరోసారి పాలవిప్లవం
గతంలో మూసివేతకు గురైన చిత్తూరు డెయిరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు. అమూల్ ద్వారా మళ్లీ చిత్తూరు డైయిరీ కార్యకలాపాలు. చిత్తూరుతో పాటు రాయలసీమ జిల్లా పాడి రైతులకు మేలు చేకూరేలా.. అతిపెద్ద సహకార డెయిరీ అయిన అమూల్ ద్వారా మరలా చిత్తూరు డెయిరీ కార్యకలాపాలు.
గతంలో మూసివేతకు గురైన చిత్తూరు డెయిరీ భూములను 99 ఏళ్లపాటు అమూల్‌కు లీజు ఇస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం. ఏటా రూ.1 కోటి ప్రభుత్వానికి లీజు రూపంలో ఆదాయం వస్తుందని క్యాబినెట్ తెలిపింది.










