పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ
పోలింగ్ బూత్‌ల వారీగా వివరాలను అందిస్తాం: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల మార్పులు, చేర్పులు కార్యక్రమం అత్యంత్య పారదర్శకంగా నిర్వహించబడిందని, పోలింగ్ బూత్ వారీగా జాబితాలు ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజకీయపార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డిఆర్‌ఓ రాజశేఖర్‌తో కలిసి కలెక్టర్ ఓటర్ల జాబితా సవరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని, ఈ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ప్రతి మూడునెలలకు ఒకసారి ఓటర్ల సవరణ ప్రక్రియలో జరిగిన మార్పులు చేర్పులకు సంబంధించి జాబితాలు సాఫ్ట్‌కాపీ ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం సర్వే పూర్తి అయిందని టెక్నికల్ సమస్యలు ఉండటం వల్ల కొంత జాప్యం జరిగిన బిఎల్వోలు ఆన్లైన్‌లో సకాలంలో చేయాలన్నారు. కార్యక్రమంలో టిడిపి ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, సురేంద్ర కుమార్, వైయస్సార్ కాంగ్రెస్ ప్రతినిధులుగా మోహన్, సిపిఎం ప్రతినిధిగా గంగరాజు, కాంగ్రెస్ పార్టీ నుంచి పరదేశి, బిజెపి ప్రతినిధిగా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.










