ప్రజాశక్తి -నెల్లూరు :ఇసి ఆదేశా మేరకు ఎన్నికల ప్రక్రియలోని ప్రతి దశను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎం హరి నారాయణన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో ఈనెల 16 నుంచి నవంబర్ 10 వరకు జరిగే ఇవిఎం, వివిప్యాట్స్, మొదటి దశ పరిశీలన గురించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్‌డిఒ కార్యాలయం ఆవరణంలోని గోడౌన్ లో ఈవిఎం, వివిపాట్స్ మొదటి దశ పరిశీలన ఈనెల 16 నుండి నవంబర్ 10 వరకు ప్రతిరోజూ జరుగుతుందన్నారు. వివిధ స్థాయి అధికారుల పర్యవేక్షణలో జరిగే ఈ పరిశీలనకు రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను పంపాలని కోరారు. రాజకీయ పార్టీలు తమ ప్రతినిధుల పేర్లను ఈనెల 14 లోపు తెలియజేస్తే వారికి ఐడెండిటి కార్డులు అందజేస్తామన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ వెంకట నారాయణమ్మ, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.










