
పొందూరు: మండల కేంద్రంలో సామాజిక ఆస్పత్రిలో గత నెల 16న పాముకాటు బాధితునికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వలన మృతి చెందిన ఘటనపై డిసిహెచ్‌ఒ జె.భాస్కరరావు ఆదేశాల మేరకు శనివారం స్థానిక సామాజిక ఆస్పత్రిలో నరసన్నపేటకు చెందిన సామాజిక ఆస్పత్రి సివిల్ సర్జన్ శ్రీనుబాబు శాఖాపరమైన విచారణ నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 16న జి. సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన కొల్లి నారాయణరావు(55)కు పాముకాటు వేసింది. కుటుంబసభ్యులు బాదితుడిని పొందూరు సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో గంటసేపు సాధారణ వైద్యం అందించిన సిబ్బంది కనీసం పాముకాటుకు వేసే యాంటీ వీనం ఇంజక్షను వేయకుండా పంపించివేయడంతో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలిం చగా అదే రాత్రి మృతిచెందాడు. దీంతో సిబ్బంది నిర్లక్ష్యంపై మృతుని బందువులు శ్రీకాకుళం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై డిసి హెచ్‌ఒ భాస్కరరావు ప్రాథమిక విచారణ జరిపగా ఈ విచారణలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించడంతో పాటు గతంలోను ఇటువంటి నిర్లక్ష్య ఘటనలు వెలుగులోకి రావడంతో ఆయన శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా శనిy ారం సివిల్ సర్జన్ శ్రీనుబాబు సమగ్ర విచారణ జరిపారు. సంఘటన సమయంలో ఉన్న సిబ్బందిని మృతుని బంధువుల సమక్షంలో వారి ఆరోపణ లపైనా, సిబ్బంది, ఆస్పత్రిపై వస్తున్న ఇతర ఆరోప ణలపై విచారణ జరిపి మృతుని బంధువుల నుంచి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు, వైద్యశాఖ ఉన్నతాధికా రులకు పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ విచారణలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రామదాసు, వైద్యులు సుజాత, ప్రతిభ, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.