Jun 09,2022 22:49

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్య క్రమంలో భాగంగా పాల సేకరణ పెర గాలని కలెక్టర్‌ యం.హరినారాయణన్‌ సంబంధిత అధి కారులను ఆదేశిం చారు. గురువారం మధ్యాహ్నం జిల్లా సచివాల యంలోని కలెక్టర్‌ ఛాంబర్‌ నందు జిల్లా కలెక్టర్‌ జగనన్న పాలవెల్లువ కార్యక్రమ అమలు తీరు కు సంబంధించి సంబంధిత అధికారు లతో సమీక్షించారు. ఈ సందర్భంగాకలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పాడి పరి శ్రమ మీద ఆధార పడి ఎక్కువ మంది రైతులు జీవిస్తున్నా రని, జిల్లా వ్యాప్తంగా 23 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని 74 కేంద్రాలలో రోజు కు 11,840 లీటర్ల పాల సేకరణ లక్ష్యం కాగా ప్రస్తుతం 7887 లీటర్లు పాల సేకరణ జరుగు తున్నదని ఈ పాల సేకరణ ను పెంచా లన్నారు.. పాల సేకరణ పెంచేందుకు క్షేత్ర స్థాయిలో అం దుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇందుకుమండల స్థాయిలో ఎంపీ డి ఓ, సచివాలయ పరి ధి లో గల వెటర్నరీ అసి స్టెంట్‌ ను ఈ కార్య క్రమంలో భాగస్వా ములు చేయాలని తెలి పారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జెడి వెంకట్రావు, జడ్పీ సిఈఓ ప్రభాకర్‌ రెడ్డి, డిస్టిక్‌ డెయిరీ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ రవిచంద్రన్‌ పాల్గొన్నారు.