Jul 12,2023 21:22

ప్రజాశక్తి - పాలకోడేరు
         పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు అవార్డులు లభించాయి. పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ సిహెచ్‌వి.రంగమనాయుడుకు, ఎఎన్‌ఎం సామ్రాజ్యంకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తిని ప్రోత్సహించే విధంగా మరో అవార్డును కలెక్టర్‌ ప్రశాంతి అందించారు. ఈ సందర్భంగా పిహెచ్‌సి వైద్యాధికారి రంగమనాయుడు మాట్లాడుతూ అవార్డుతో పాటు నగదు బహుమతులు కూడా అందించారన్నారు. డిఎంహెచ్‌ఒ మహేశ్వరరావును, డాక్టర్‌ రంగమనాయుడును, ఎఎన్‌ఎం సామ్రాజ్యంను కలెక్టర్‌ అభినందించారు. అవార్డు అందుకున్నవారిని పిహెచ్‌సి వైద్యులు స్వర్ణ నిరంజని, సీత, లక్ష్మి, సుజనా, సిహెచ్‌ఒ సత్యనారాయణ, పిహెచ్‌ఎన్‌ కుమారి అభినందించారు.