ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు నియోజ కవర్గంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం పడింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు రెండు రోజుల అకాల వర్షాలతో ఛిద్రంగా మారాయి. దీనికితోడు చలిగాలులు వీస్తుండడంతో జనం వణికిపోతున్నారు. అయితే మధ్యాహ్నం నుంచి కాసింది.
మొగల్తూరు : ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు చిత్తడిగా మారాయి. ఆదివారం తెల్లవారుజామున మండలంలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో ఇటుక వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ కోసం 24 గంటలు ఏరియేటర్లో వినియోగిస్తున్నారు.










