Oct 12,2023 19:39

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం


వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం
పాదయాత్రను జయప్రదం చేయండి
ప్రజాశక్తి-మర్రిపాడు:స్థానిక ఎస్‌సి బాలుర హాస్టల్‌ లో మాదిగల విశ్వరూప పాదయాత్ర కరపత్రాలను ఎంఎసిపి జిల్లా ఇన్‌ఛార్జ్‌ పందిటి అంబేద్కర్‌ మాదిగ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. మంద కష్ణ మాదిగ అక్టోబర్‌ 7 నుంచి నవంబర్‌7వరకు చేస్తున్న అలంపూర్‌ టు హైదరాబాద్‌ మాదిగల విశ్వరూప మహా పాదయాత్రలో భాగంగా నవంబర్‌ లో జరిగే విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలోఎంఆర్‌పిఎస్‌ జిల్లా కోకన్వీనర్‌ తాటిపర్తి లక్ష్మయ్య మాదిగ, సోంపల్లి హాజరత్తయ్యమాదిగ, వడ్లపల్లి రమణమ్మ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.