Oct 09,2023 17:38

మాట్లాడుతున్న సిపిఎం, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :చేయి చేయి కలుపుదాం.. పోరాడి అభివృద్ధి సాధిద్దాం.. అని సిపిఎం, సిఐటియు మండల కార్యదర్శులు వేగూరు వెంకయ్య, మారుబోయిన రాజా పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్ర ఈనెల 11, 12 తేదీల్లో తోటపల్లిగూడూరు మండలంలో జరగనుం దన్నారు. పాదయాత్రను జయప్రదం చేయాలని వెంకయ్య, రాజాలు కోరారు. సోమవారం వారు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రజా ప్రతినిధులకు ఉద్యోగాల కల్పన అంశం ఒక హామీగా మారిందని విమర్శించారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం, అందుకు అవసరమైన శిక్షణ కేంద్రాల ను ఏర్పాటు చేస్తామని ఐదేళ్లకు ఒకసారి చెప్ప డం, మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఆఊసే ఎత్తక పోవడం పరిపాటి అయిందని విమర్శించారు.