Oct 12,2023 19:24

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
పాదయాత్రకు సంఘీభావం
ప్రజాశక్తి-ఇందుకూరుపేట:పొదలకూరు నుంచి ప్రారంభమైన సిపిఎం పాదయాత్ర వెంకటాచలం మీదుగా ముత్తుకూరు, తోటపల్లి గూడూరు, నుంచి సిపిఎం పాదయాత్ర నరుకూరుకు గురువారం చేరింది. ఈ పాదయాత్రకి సంఘీభావం తెలుపుతూ ఇందుకూరుపేట సిపిఎం, సిపిఐ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో ఇందుకూరుపేట సిపిఎం మండల కార్యదర్శి కోటేశ్వరావు, రైతు సంఘం నాయకులు సిద్దవరపు ప్రభాకర్‌ రెడ్డి, ఇందుకూరుపేట శాఖ కార్యదర్శి కోనేటి వెంకయ్య, ఇందు కూరుపేట సిఐటియు మండల అధ్యక్షులు చాంద్‌ భాషా, తదితరులు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.