పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరణ
ప్రజాశక్తి-అనంతసాగరం : మాదిగల విశ్వరూప పాదయాత్రకు సంఘీభావంగా శనివారం మండలంలోని ఎస్‌సి కాలనీలో ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌పి నాయకులు విశ్వరూప పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌పి జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఆర్‌పిఎస్ జిల్లా కోకన్వీనర్ తాటిపర్తి లక్ష్మయ్య మాదిగలు మాట్లాడుతూ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్‌సి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ అక్టోబర్ 7న అలంపూర్ నుండి నవంబర్ 7 హైదరాబాద్ వరకు మాదిగల విశ్వరూప మహా పాదయాత్రలో నవంబర్‌లో జరిగే విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రతి మాదిగ పల్లెకు కరపత్రం చేరే విధంగా ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌పి అనుబంధ సంఘాల నాయకులు మండలంలోని పాదయాత్రకు సంఘీబావంగా గ్రామగ్రామాన ప్రచారంలో దూసుకు పోవాలని ఎంఆర్‌పిఎస్ నేతలు తెలిపారు. విశ్వరూప పాదయాత్ర విజయవంతం కోసం ప్రతీ కార్యకర్త శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్‌పి నాయకులు, వడ్లపల్లి రవి మాదిగ, సిహెచ్ బాబు మాదిగ, కాకి అరుణ్ మాదిగ, మాదిగ విద్యార్థులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.










