Mar 28,2022 23:04

స్వర్ణముఖిలో పడేసిన భక్తులు పాదరక్షలను పరిశీలిస్తున్న హిందూ ధార్మిక పరిషత్‌ నాయకులు

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: స్థానిక భిక్షాలి గాలి గోపురం వద్ద భక్తులకు అందుబాటులో ఉండేలా పాదరక్షల స్టాండును ఏర్పాటు చేయాలని హిందూ ధార్మిక మండలి నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం వారు స్వర్ణముఖి నదిలో పడేసిన భక్తుల పాదరక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్వీనర్‌ గరికపాటి రమేష్‌బాబు మాట్లాడుతూ ఎక్కువ మంది భక్తులు భిక్షాలి గాలి గోపురం నుంచి ఆలయంలోని ప్రవేశిస్తారని తెలిపారు. ఈ క్రమంలో వారికి పాదరక్షల స్టాండు అందుబాటులో లేకపోవడంతో బయటే వదిలి వెళ్తున్నారనీ, దర్శనానంతరం తిరిగొచ్చే సరికి పాదరక్షలు చెల్లాచెదురై గుర్తు పట్టలేని పరిస్థితి ఏర్పడు తోందన్నారు. ఫలితంగా భక్తులు పాదరక్షలను అక్కడే వదిలేసి నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని వాపోయారు. పేద భక్తులైతే కొత్తవి కొనుక్కునే స్థోమత లేక పాదరక్షలు లేకుండా వెళ్లిపోతున్నారని చెప్పారు. అధికారులుఉ స్పందించి పాదరక్షల స్టాండు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.