ఉరవకొండ : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణపై నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య సూచించారు. శనివారం అనంతపురంలోని వైసిపి కార్యాలయంలో ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ల వెరిఫికేషన్ సందర్భంగా టిడిపి నాయకులు దొంగఓట్లను తొలగించకుండా బిఎల్‌ఓలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, కమ్మ, కురుబ, వాల్మీకి కార్పొరేషన్ల డైరెక్టర్లు తేజోనాథ్, గోవిందు, దుద్దేకుంట రామాంజనేయులు, ఉరవకొండ జెడ్పిటిసి పార్వతమ్మ, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ సుశీలమ్మ, బెలుగుప్ప ఎంపిపి పెద్దన్న, మండల కన్వీనర్ శ్రీనివాసులు, నాయకులు కరణం భీమరెడ్డి, వెంకటరెడ్డి, రాచనగౌడ్, వసికెరి రమేష్, సోమశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి










