Jun 14,2022 22:21

ఓటిఎస్‌ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి
ప్రజాశక్తి -నగరి:
మంత్రి క్యాంపు కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గహ హక్కు పథకం (ఓటీఎస్‌) ఇళ్ల పట్టాలను మంత్రి రోజా లబ్ధిదారులకు అందించారు. మంగళవారం నగరిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మండలంలోని గుండ్రాజుకుప్పం దళితవాడ పంచాయతీకి చెందిన 45 మంది అర్హులకు (ఓటీఎస్‌) జగనన్న సంపూర్ణ గహ హక్కు పథకం ఇళ్ల పత్రాలు మంజూరు చేయగా వాటిని రాష్ట్ర పర్యాటక సాంస్కతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖా మంత్రి వర్యులు మరియు కష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు రోజా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ సంపూర్ణ గహ హక్కు పథకం వలన కలిగే లాభాలను వివరించారు. అలాగే లబ్ధిదారులు వారికి చెందిన ఆస్తిపై సంపూర్ణంగా వారికి హక్కులు ఉంటాయని, రేపు వాటి మీద అత్యవసర పరిస్థితుల్లో గానీ ఇంటి అవసరాలకు బ్యాంకు రుణాలు కూడా పొందవచ్చని తెలిపారు. కనుక ప్రతి ఒక్క లబ్ది దారులు కూడా ఓటిఎస్‌ చేసుకొని సంపూర్ణ హక్కుదారులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామచంద్ర, ఎంపీపీ మంజుభార్గవి, వైసిపి నాయకులు గోవర్ధన్‌, గుణశేఖరన్‌ తదితరులు పాల్గొన్నారు.