Oct 21,2023 23:16

నిరసన వ్యక్తం చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి- సోంపేట: ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవి విరమణ తర్వాత హాయిగా జీవితాన్ని గడపాలంటే ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ అని స్థానిక యుటిఎఫ్‌ నాయకులు నినదించారు. శనివారం సోంపేటలో జిల్లా యుటిఎఫ్‌ సహాధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితాన్ని పూర్తిగా వృత్తికే అంకితం చేసి చివరి దశలో విశ్రాంత ఉద్యోగులుగా హాయిగా ఉండేందుకు పెన్షన్‌ ఎంతో భరోసాగా ఉండాలని గత ప్రభుత్వాలు పాత పెన్షన్‌ అమలు చేశాయన్నారు. పాత పెన్షన్‌ అమలు చేయాలని యుటిఎఫ్‌ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షలు ప్రభుత్వం భగం చేయడం అత్యంత అప్రజాస్వామికం, హేయమైన చర్యగా పేర్కొన్నారు. పాత పెన్షన్‌ అమలు చేయకపోతే ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లడానికి వెనకాడమన్నారు. కార్యక్రమంలో సోంపేట మండల అధ్యక్షు లు గొరకల దొరబాబు, ఎల్‌.రవికుమార్‌, సీనియర్‌ కార్యకర్తలు పి. హేమచంద్రరావు, జి.ప్రకాష్‌, ఎస్‌.కూర్మారావు, పి.కుమారస్వామి, కాళిదాసు, నాగేశ్వరరావు, రుద్రయ్య, కె.గోపి, జి.గోపాల్‌, తేజోమూర్తి పాల్గొన్నారు.