May 26,2023 15:22

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : ఈఎస్ఐ పథకాన్ని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు విరమించుకోవాలని కోరుతూ సిఐటియు తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఈఎస్ఐ డిస్పెన్సరీ వద్ద ధర్నా నిర్వహించారుఈ ధర్ననుద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు ఉపయోగకరమైన హాస్పటల్ నందు సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మందులు,ల్యాబ్ టెక్నీషియన్లు వంటి సదుపాయాలతో పాటు డిస్పెన్సరీలో డాక్టర్ కూడా లేకపోవడం చాలా దారుణమన్నారు. కోట్లాది రూపాయలు కార్మికుల సొమ్ము ఉన్నప్పటికీ వాటిని కార్మికులకు అనుకూలంగా ఉపయోగించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాకు 30 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో వందలాది మందికి ఉపయోగకరంగా ఉండాల్సిన ఈఎస్ఐ హాస్పిటల్ నందు డాక్టర్ సక్రంగా లేకపోవడంతోగత వారం రోజుల నుంచి హాస్పిటల్ కి వచ్చిన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ పథకాన్ని బలోపేతం చేసి కార్మికులందరికీ వైద్య సదుపాయం కల్పించాలని, మందులు, డాక్టర్లు టెక్నీషియన్లు నియమించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి 3ఎఫ్ యూనియన్ నాయకులు టి గణేష్,వి.సత్యనారాయణ, కనకరాజు, ప్రసాద్ బాబు,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధనాల దానయ్య, ఎస్ సతీష్ , అల్లం పద్మ , కే దయమని తదితరులు నాయకత్వం వహించారు.