Oct 17,2023 19:44

స్వర్ణోత్సవ జ్ఞాపికను ఆవిష్కరిస్తున్న దృశ్యం

స్వర్ణోత్సవ జ్ఞాపికను ఆవిష్కరిస్తున్న దృశ్యం
ఒపిఎస్‌ సాధనకై యుటిఎఫ్‌ నిరవధిక దీక్షలు
ప్రజాశక్తి-నెల్లూరు:సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాలు రద్దు చేసి పాతపెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నేటి నుంచి యుటిఎఫ్‌ నిరవధిక దీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.నవకోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం నగరంలోని యూటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ముందుగా స్వర్ణోత్సవ జ్ఞాపికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల సమయంలో చేసి హామీని అనుసరించి ఒపిఎస్‌ అమలు చేయాలన్నారు. పలు రాష్ట్రాల్లో సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా జిపిఎస్‌ పేరుతో నూతన విధానం అమలు చేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు.
సిపిఎస్‌కు, జిపిఎస్‌కు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. నేటి నుంచి యూటిఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రంలో నిరవదిక దీక్షలు ప్రారంభిస్తున్నామని, ఈ క్రమంలో 19వ తేదిన జిల్లా కేంద్రాలల్లో, 20వ తేది నుంచి 23 వరకు ప్రాంతీయ కేంద్రాల్లో నిరవధిక దీక్షలు నిర్వహించే విధంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి.చలపతి శర్మ మాట్లాడుతూ 19వ తేదిన యూటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో నిరవధిక దీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు. 20వ తేదిన కందుకూరు, కావలి, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, పొదలకూరు, వింజమూరు, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతీయ కేంద్రాల్లో ఈ నిరవధిక దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో జిల్లా నాయకులు, ప్రాంతీయ కేంద్రాల్లో మండల నాయకులు ఈ దీక్షలల్లో కూర్చొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు కిలారి వెంకటేశ్వర్లు, సహాధ్యక్షులు ఎం.సి అచ్చయ్య, జిల్లా కార్యదర్శులు కె.నాగిరెడ్డి, బి.శివప్రసాద్‌రావు, కె.శ్రావణకుమార్‌, ఎస్‌కె ఖాజావల్లి, ఎన్‌.సురేంద్రబాబు, ఎం.రవిబాబు, ఈ .బాలరాగయ్య, హెచ్‌.మోహన్‌ప్రసాద్‌, జి.దయాకర్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఈ.వి.నారాయణ, రాష్ట్ర కౌన్సిలర్లు , ఆడిట్‌ కమిటీ సభ్యులు, కుటుంబ సంక్షేమ సంఘం బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.