
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం: ఓపెన్ టెన్త్ పరీక్షా కేంద్రం ఇచ్చాపురంలో మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే సాయిరాజు, ఎమ్మెల్సీ రామారావుకు నాయకులు వినతిపత్రం అందించారు. గతంలో ఐదు సంవత్సరాలు ఇచ్చాపురం కేంద్రంగా ఉన్న ఓపెన్ టెన్త్ కేంద్రం టెక్కలికి మార్చడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్లు రెండు, మూడు బస్సులు మారాల్సి వస్తుందని, దీనివలన పరీక్షకు వెళ్లే వారు హాజరు కాలేకపోతున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇచ్చాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం మంజూరు చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో మున్సిపల్. ఛైర్పర్సన్ రాజ్యలక్ష్మి, ఆరోవార్డు ప్రతినిధి పి.కోటి, వార్డు కౌన్సిలర్ తాడి ఆదిరెడ్డి, రాంజీ, ప్రేమ కుమార్, ప్రత్తి అన్వేష్, బత్తుల రామారావు నాయకులు ఉన్నారు.