Sep 14,2023 22:53

ఓపెన్‌ హార్ట్‌ సర్జరీకి ఆర్థిక సాయం

ఓపెన్‌ హార్ట్‌ సర్జరీకి ఆర్థిక సాయం
- బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి రూ.6 లక్షలు మంజూరు చేయించిన మంత్రి
ప్రజాశక్తి- నగరి : ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తానెప్పుడూ ముందుంటానని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్కేరోజా మరోమారు నిరూపించారు. గురువారం తన నివాస కార్యాలయం వద్ద పుత్తూరు మండలం తిరుమల కుప్పం గ్రామానికి చెందిన పి గురుస్వామి నాయుడుకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీకి రూ. 6 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించారు. ఇటీవల మండలంలో మంత్రిని కలిసిన బాధితుని కుటుంబ సభ్యులు గురుస్వామి నాయుడు పరిస్థితిని మంత్రికి వివరించారు. గుండె సంబంధిత వ్యాధి సోకిందని ఓపన్‌ హార్ట్‌ సర్జరీ చేయించాలని వైద్యులు సూచించినట్లు మంత్రి దష్టికి తీసుకువచ్చారు. లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో తమ ఏం చెయ్యాలో తోచలేదంటూ మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేయించి రూ.6 లక్షలు మంజూరయ్యేలా చేశారు. గురువారం సహాయనిధి చెక్కును భాదిత కుటుంబానికి అందచేశారు. తమ బాధను అర్థం చేసుకొని వెనువెంటనే స్పందించిన మంత్రికి బాధిత కుటుంబసభ్యులు కతజ్ఞతలు తెలిపారు.