May 24,2023 15:10

ప్రజాశక్తి-భీమవరం : ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు బదిలీకి ఆన్లైన్ లో ధరకాస్తు చేసుకోనేదుకు వీలుగా ఉపాధ్యాయులు సౌకర్యార్థం యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆన్లైన్ కేంద్రాన్ని ప్రారంభిచడం జరిగింది. ఈ కేద్రన్ని   యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొనవలసిందిగా కోరారు.  ఉపాధ్యాలు ఇబందులను   దృష్టిలో ఉంచుకొని  వారి సౌకర్యార్థం  ఆన్లైన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి ఎస్ విజయరామరాజు, జిల్లా కార్యదర్శి కె ఎస్ రామకృష్ణ ప్రసాద్, కే త్రిమూర్తులు, పి రమణ రాజు, జి సుకుమార్, ఆర్ రామ మూర్తి, మురళి కృష్ణ,రహీమ్  పాల్గొన్నారు.