ప్రజాశక్తి-అనంతపురం ఐఎన్‌టిఎస్‌ఒ ఒలం పియాడ్ రెండవ లెవెల్లో అనంతపురం జోన్‌కి చెందిన శ్రీ చైతన్య విద్యార్థులు అత్యధిక గ్రాండ్ ప్రైజ్‌లు, గోల్డ్ మెడల్స్, కాంసోలేషన్ బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్స్ సొంతం చేసుకున్నారని ఎజిఎం సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కమ్మభవన్ సమీపంలోని శ్రీ చైతన్య స్కూల్ సి అండ్ ఎం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ఎజిఎం సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకి మిఠాయిలు పంచి అభినందించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ అనంతపురం 1 బ్రాంచ్‌కి చెందిన కె.హేమంత్, వెంకట సాయి (5వ తరగతి), అనంతపురం 5 బ్రాంచ్‌కి చెందిన ప్రణీత్ (8వ తరగతి), అనంతపురం 6కి చెందిన సాయి చరణ్, వర్షిత్, సిబిఎస్‌సి బ్రాంచ్‌కి చెందిన లక్షిత్ (8వ తరగతి), గ్రాండ్ ప్రైజులు గెలుచుకున్నారన్నారు. 13 మంది విద్యార్థులు మొదటి బహుమతి, ముగ్గురు ద్వితీయ బహుమతి, 12 మంది 3వ బహుమతి, 15 మంది 4వ బహుమతి, 29 మంది 5వ బహుమతి, 510 మంది కాంసోలేషన్ బహుమతులను, 71 మంది స్పెషల్ ప్రైజ్‌లు, గోల్డ్ మెడల్, 326 మంది గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్స్, 183 మంది గోల్డ్ మెడల్స్, 2389 మంది మెరిట్ సర్టిఫికెట్స్ మొతంగా 4155 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. పటిష్టమైన పాఠ్యప్రణాళిక, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం వల్లనే ఇంతటి ఘనవిజయం సాధ్యం అయిందని అన్నారు. ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విశ్వనాధ్, తబస్సుం, ఖలందర్, షామీనా ఖాన్, పర్వీన్ భాను, వెంకటేష్, నేత్రవతి, శాంత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.










