Apr 03,2022 22:52

ఎన్నికైన వన్నెకుల క్షత్రియ నూతన కమిటీ సభ్యులు

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి:
నియోజకవర్గం పరిధిలోని వన్నెకుల క్షత్రియులంతా ఒక్కతాటిపైకి వచ్చారు. స్థానిక వన్నెకుల క్షత్రియ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఐక్యతా రాగం పాడారు. వన్నెకుల క్షత్రియులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవసరమైన సాయాన్ని అందిచాలని ప్రతిజ్ఞ చేశారు. బాలాజీ ప్రసాద్‌ రెడ్డి, సత్రవాడ ప్రవీణ్‌, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.