Sep 16,2023 23:50

ఓజోన్‌ పొర రక్షణ అందరి బాధ్యత

ఓజోన్‌ పొర రక్షణ అందరి బాధ్యత
ప్రజాశక్తి- నగరి : ఓజోన్‌ పొరను రక్షించుకోవడం అందరి బాధ్యతని నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.వేణుగోపాల్‌ అన్నారు. శనివారం అంతర్జాతీయ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకో క్లబ్‌ ఆధ్వర్యంలో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి పోస్టర్‌ ప్రదర్శన చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓజోన్‌ పొరను రక్షించుకోవడం మనందరి బాధ్యతని లేకుంటే ఈ భూమిపై జీవం అన్నదే ఉండదన్నారు. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం బలమైన చట్టాలు తేవాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ భాస్కర్‌ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్‌ ఇందిరా ప్రియదర్శిని, స్వాతి, శ్రీలక్ష్మి, పంకజ, రేవతి, ఉమామహేశ్వరి, మునికుమారి పాల్గొన్నారు.