ప్రజాశక్తి-పుట్లూరు : హౌసింగ్ డే కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని హౌసింగ్ ఇళ్లను మండల అధికారులు పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి బిల్లులు సక్రమంగా పడుతున్నాయా లేదా, సిమెంట్ ఇస్తున్నారా లేదా అని ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో ఇల్లు తొందరగా పూర్తి చేయాలని సూచించారు. మండలంలోని పుట్లూరు పంచాయతీ, పెద్దబాలి లక్ష్మీనారాయణమ్మ w/o రామాంజినేయులుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం 2021-22 ఆర్థిక సంవత్సరం కింద ఇల్లు మంజూరు అయింది. ఈ లబ్ధిదారునికి నిర్మించిన పైకప్పు వరకు సిమెంట్ 60 బాగ్స్ మరియు 1,1౦,౦౦౦/- Rs ప్రభుత్వo ద్వారా లబ్ధిదారురాలి బ్యాంక్ ఖాతాకి జమ చేయడo జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి యోగానంద రెడ్డి, తహశీల్దార్ మోహన్ కుమార్, హౌసింగ్ ఏఈ లోకేష్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ క్రిష్టయ్య, ఎపి ఓ చెన్నకేశవులు, టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్, ఇంజినీరింగ్ సహాయకుడు సునీల్ కుమార్, సంక్షేమ సహాయకులు గీత, హార్టికల్చర్ సహాయకుడు మురళి, ఎఎన్ ఎం నాగజ్యోతి పాల్గొన్నారు.










